కందనవోలు కర్నూలు

98వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని* పురస్కరించుకొని సోమవారం నగరములోని వెంకటరమణ కాలనీలోని *కేశవరెడ్డి పాఠశాలలో* (ఏడు కార్నివల్ )* వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా *నర్సరీ నుండి పదవ తరగతి* విద్యార్థులు *సైన్స్ డే* సందర్భంగా అన్ని సబ్జెక్టుల నుండి వివిధ నమూనాలు ప్రదర్శించారు. ఇందులో *”లైఫ్ ప్రాసెసింగ్”, “గ్లోబల్ వార్మింగ్”, “IR సెన్సార్*” *సెక్యూరిటీ అలారం”, “చంద్రయాన్-3” “క్షేత్రగణితం”, “కంజుమర్ కోర్టు” “తెలుగు జానపద కళలు- క్రీడల క్రింద* *అలనాటి కోలాటం , థింసా నృత్యం, హరిదాసు, వైకుంఠపాళీ తొక్కుడు బిళ్ళ…. సెల్ ఫోన్*.. *చెట్ల సంరక్షణ మీద సాగిన బుర్రకథ* , మొదలగు మోడల్ ఎగ్జిబిషన్లు విశేషంగా నగర ప్రజలకు మానసిక ఆనందంతోపాటు, కనువిందును కలిగించాయడంలో అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా కేశవరెడ్డి పాఠశాలల వ్యవస్థాపక అధ్యక్షులు యన్. కేశవరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న దేశంలో జాతీయ సైన్స్ డే వేడుకలు జరుపుకుంటారని, 2026 సంవత్సరమును వికసిత్ భారత్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే నినాదంతో “ఉమెన్స్ ఇన్ సైన్స్ కాటలైజింగ్ వికసిత్ భారత్*”గా భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనల ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథంతో పాటు ఆలోచన శక్తిని, సృజనాత్మకతను వెలికి తీసి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటంలో కేశవరెడ్డి పాఠశాలలు ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులను. యన్. కేశవరెడ్డిప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నగర ప్రజలు, యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు.
