కందనవోలు కల్లూరు

 

తేది 02.03.2026 నుండి 09.03.2026 వరకు జరుగుతుంది అని కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు.
కల్లూరు మండలం నందు నాయకల్లు గ్రామములోని రీ-సర్వే కార్యక్రమం తర్వాత పూర్తి విస్తీర్ణం ఎకరముల 3477.794 సెంట్స్ నకు మొత్తం రైతులకు గల ఖాతాలు 1188.
గ్రామానికి మొత్తం ఖాతాలు 1188 లోని ప్రస్తుతం 1033 ఖాతాలకు, జిల్లా కలెక్టర్ కార్యాలయము కర్నూలు నుండి పొందియుండి పంపిణీ చేయడం జరుగుతున్నది.
నాయకల్లు రెవిన్యూ గ్రామం నందు వ్యవసాయ భూమి కలిగిన రైతులు ప్రక్కన ఉన్న గ్రామాలైన బొల్లవరం, రెమడూరు, పుసులూరు, అనుగొండ, చెట్లమల్లాపురం, కొంగనపాడు, లద్దగిరి మరియు ఉలిందకొండ గ్రామానికి చెందినవారు కలరు.
గత రీసర్వే కార్యక్రమంలో నందు సర్వేలో వచ్చిన తప్పులు అయిన ఫోటో/ కులము /మొబైల్ నెంబరు/ ఆధార్ నెంబర్/ 104 ఖాతాలను గుర్తించి వాటిని సరిచేసి మొత్తం 1033 ఖాతాలకు పంపిణీ చేయుటకు పట్టాదారు పాటిస్తున్నములు సిద్ధంగా ఉన్నవి.
నాయకల్లు గ్రామ రైతులతో పాటు సరిహద్దు గ్రామ రైతులు కూడా ఈ పట్టాదారు పసుపుస్తకముల పంపిణీ నందు తమ కొత్త గారు పాస్ పుస్తకములు లను స్వీకరించవలసిందిగా తెలియజేయడమైనది.
ప్రస్తుతం ఈరోజు అనగా తేది 02.03.2026 నుండి 09.03.2026 వరకు వరకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకములు పంపిణీ చేయడం జరుగుతుంది.
హాజరు అయిన అధికారులు
రీ-సర్వే డిప్యూటీ తహసీల్దార్ జయశ్రీ,
VROs విజయమనోహర్, శ్రీనివాసులు, మద్దిలేటి, రాజు, సురేష్, VS రాజులు పాల్గొన్నారు.