కందనవోలు కర్నూలు 
రంజాన్ ఎంతో పవిత్రమైన మాసం అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని రోజా మసీదుతో పాటు పోలీస్ లైన్ మసీదు, ధర్వేశ్ ఖాద్రి మసీదులో ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మసీదులో ఉపవాసాలు విరమించిన ముస్లిం సోదరులకు విందు వడ్డించారు. అనంతరం పోలీస్ లైన్ మసీదు తో పాటు ధర్వేశ్ ఖాద్రి మసీదులో నూతనంగా ఏర్పాటు చేసిన మిలార్ లను ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో మసీదులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మసీదు కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. నగరంలోని ఇతర మసీదుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, మసీదు కమిటీ ప్రెసిడెంట్లు షేక్ యూనిస్, మెహబూబ్ ఖాన్, మసీదు కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
