కందనవోలు కల్లూరు

రైతు క్షేమమే లక్ష్యంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే  గౌరు చరిత రెడ్డి    కల్లూరు మండలం తాసిల్దారు కే ఆంజనేయులు  హాజరై రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు.అనంతరం నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి గౌరు చరిత రెడ్డి  మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ కేక్ కట్ చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, కే ఆంజనేయులు ఎంపీడీఓ, ఎస్సై, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి మరియు గ్రామ స్థాయి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You missed