కందనవోలు ఆలూరు

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఎంపీ వర్గం, ఇంచార్జి వర్గం అంటూ రెండు వర్గాలు లేవని ఎంపీ బస్తిపాటి నాగరాజు స్పష్టం చేశారు.. హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భక్త కనక దాసు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు..ఈ సందర్బంగా కనకదాసు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు…అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గాలు లేవని, అంతా ఒక్కటే పార్టీ వర్గమన్నారు.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, డైరెక్టర్లు శ్రీనివాసులు, రామకృష్ణ, ఆలూరు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ జయరాం, స్టానిక టీడీపీ నాయకులు, కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు..
