కనందనవోలు ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు కనందనవోలు మహిళలే మహారాణులుగా తీర్చి దిద్దడంమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని మండల పరిషత్ సమావేశ భవనం నందు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి. యంపిడిఓ బంగారమ్మ అద్యక్షతన స్వయం సహాయక మహిళా సంఘాల మెప్మా సిఎంఎం జయ వర్థన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి హాజరయ్యారు ముందుగా దీప ప్రజ్వలనం చేశారు. అనంతరం మహిళలు ఆత్మగౌరవం సమాజ అభివృద్ధిలో కీలక పాత్రను గుర్తించి వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు శాలువ కప్పి పూలమాలలతో ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి సత్కరించారు. విద్యార్థినీలు సాంస్కృతిక కార్యక్రమాలు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి మాట్లాడుతూ మహిళలు వంటింటకే పరిమితం కాకుండా తన స్వశక్తి తో ఉద్యోగ వ్యాపార లావాదేవీలతో ఆర్థికాభివృద్ధి బలపడే దశలో
ముందుకు నడుస్తున్నారన్నారు. మహిళల సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్ణీ కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప. మార్కెట్ యార్డు చైర్మన్ కురువ మల్లయ్య. మున్సిపల్ మెప్మా సిబ్బందికి ఆర్పీలు. సీఓలు. స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు మహిళలు పాల్గొన్నారు.
