కందనవోలు కల్లూరు

138 – పాణ్యం నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఓటరు నమోదు అధికారి మరియు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ ఆధ్వర్యంలో మార్చి 10.03.2026 నుండి 12.03.2026 వరకు కల్లూరు మండలంలోని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల, కె.వి. సుబ్బారెడ్డి మహిళా కళాశాల, సాయికృష్ణ డిగ్రీ కళాశాలలలో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా 17, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడం ఎంతో ముఖ్యమని అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లోని ఓటరు పోర్టల్ ద్వారా ఎలా ఓటరు నమోదు చేసుకోవాలో డిగ్రీ విద్యార్థులకు వివరించారు.
ఈ రోజు సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ పాల్గొని విద్యార్థులకు ఓటరు నమోదు విధానం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో సాయికృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జానీ భాష, కళాశాల సిబ్బంది, కల్లూరు మండలం తహసీల్దార్ కె. ఆంజనేయులు, ఎలెక్షన్ డిప్యూటీ తహసీల్దార్ జి. అనురాధ, వీఆర్వోలు రామకృష్ణ, ఇస్మాయిల్, అలాగే బీఎల్ఓలు పాల్గొన్నారు.