కందనవోలు కర్నూలు
రేపటి నుంచి ప్రారంభమవుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా కర్నూలు జిల్లా మరియు ఆదోని మండలంలోని విద్యార్థులకు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బత్తిని కుబేర్ నాథ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల పట్ల భయం, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవాలని, ఇప్పటి వరకు చదివిన విషయాలను ఒకసారి పునశ్చరణ చేసుకోవాలని అన్నారు. ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా చదివి తమ శక్తి సామర్థ్యాల మేరకు ఉత్తమంగా సమాధానాలు రాయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
