కందనవోలు పులివెందుల
రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారని, చంద్రబాబుకు రాజకీయ అవసరం ఉన్న సమయంలో సునీత బయటకు వచ్చి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, వివేక హత్య కేసులో ఏకపక్షంగా సిబిఐ విచారణ కొనసాగిందని జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం న్యూఢిల్లీ నుండి వివేక కేసుకు సంబంధించి పలు విషయాలను జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాకు తెలుపుతూ వివేక కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత అనేక అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని, వివేకానంద రెడ్డిది గుండెపోటు అనే సృష్టించింది సునీతతో పాటు నర్రెరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తులని, వివేక హత్య గురించి ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చింది తానేనని, తప్పుడు సాక్షాలు చెప్పాలని సునీత కొందరిపై ఒత్తిడి చేశారని, వారు చెప్పినట్లే సిబిఐకి చెప్పాలని సునీత బెదిరించారని, రామ్ సింగ్ విచారణ అధికారిగా వచ్చాక కేసు పక్కదారి పట్టడం జరిగిందని, సిబిఐ డైరెక్టర్ కు అనేక సాక్షాలు సమర్పించి విచారణ జరిపించాలని అనేక సందర్భాలలో అభ్యర్థించామని అలా కాకుండా సిబిఐ తనకు నచ్చిన వారిని మాత్రమే పిలిపించి మాట్లాడారని, వైయస్ వివేకా కేసును చంద్రబాబు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, వచ్చే ఎన్నికల వరకు వివేకా కేసు కొనసాగదీయాలనేది సునీత చంద్రబాబుల ప్రధాన ఉద్దేశం అని, సిబిఐ స్టేట్మెంట్ తీసుకునే సమయంలో సునీతను లెటర్ గురించి వివరణ అడగగా లెటర్ గురించి సిబిఐ అడిగిన ప్రశ్నలకు సునీత సరైన సమాధానం అందించలేదని, సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని, సునీత కు దస్తగిరి అత్యంత ఆప్తుడని, దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా సునీత అడ్డుకుంటున్నారని, దస్తగిరి తరపున లుద్రా న పెట్టి కేసు వాదనలు వినిపిస్తున్నారని, విచారణ సక్రమంగా చేయాలని సిబిఐ డైరెక్టర్లకు అనేకసార్లు విన్నవించుకున్నామని మూడేళ్లుగా విచారణ సక్రమంగా జరగకుండా సునీత అడ్డుకుంటున్నారని, ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుందని ఈ కేసును సిబిఐ న్యాయస్థానం ద్వారా త్వరగా విచారణ పూర్తి చేయాలని అనేకసార్లు పేర్కొన్నామని, దస్తగిరి, డ్రైవర్ ప్రసాద్, రాజశేఖర్ ఇచ్చిన స్టేట్మెంట్లను సునీత చదవలేదని, హత్యకు ముందు రోజు రాజశేఖర్ ను ఎందుకు కాళహస్తికి పంపించారో తెలియాలని, చివరి రోజుల్లో వివేకానంద రెడ్డిని మానసికంగా వేధించారని, డాక్యుమెంట్స్ కోసమే వివేకానంద రెడ్డిని హత్య చేశామని దస్తగిరి చెప్పారని, పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లెటర్ ను సునీత పోలీసులకు ఎందుకు అందించలేదు తెలియాలని, సిబిఐ విచారణ ఏకపక్షంగా కొనసాగిందని హత్య జరిగిన రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నారని సాక్షులకు శిక్షణ ఇచ్చి మరి నాపై వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇప్పించారని, శివప్రసాద్ రెడ్డి తనకు ఫోన్ చేసి వివేకాకు గుండెపోటు అని చెప్పారని, గుండెపోటు వచ్చిందని థియరీ సృష్టించింది సునీత రాజశేఖర్ రెడ్డి అని దీనిపై ఎందుకు విచారణ జరగడం లేదు అర్థం కావడం లేదని, వివేకాను ఆయన కుటుంబం వదిలేసిందని, ఆయన చెక్ పవర్ తీసేసారని మరియు ఆయన కొడుకుకు ఆస్తులు దక్కకుండా ఉండేందుకే వివేకాను హత్య చేసి ఉండవచ్చునే కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ఈ అంశాలపై ఇప్పటికే ప్రధానమంత్రి మరియు హోమ్ మంత్రులకు లేఖ రాయడం జరిగిందని, చట్టం, ధర్మం మరియు దేవుడిపై నమ్మకంతో ముందుకెళుతున్నామని దేవుడిపై పూర్తి నమ్మకంతో ఉన్నామని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
