కందనవోలు పులివెందుల
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు పులివెందుల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పూలంగాల సర్కిల్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పులివెందుల మున్సిపల్ ఇంచార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ మరియు ఆర్యవైశ్య సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం సాధించాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగం మరువలేనిదని,నేటి తరానికి ఆయన ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప,వైసిపి పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్ రెడ్డి,పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్ పాల్గొన్నారు. అలాగే వైసిపి నాయకులు సంపత్,సోమశేఖర్,అరుణ్, భాను ప్రకాష్,దాసు, సుబ్బారెడ్డి,మధు తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు,ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొని అమరజీవికి అంజలి ఘటించారు.
