కందనవోలు పులివెందుల
తెలుగువారి తొలి పండుగ ఉగాది అని సరికొత్త ఆశలకు ఆశయాలకు ప్రతీక,చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగతో వసంత రుతువు ప్రారంభమవుతుందని చెట్లు చిగురించి,ప్రకృతి అందాలను సంతరించుకుంటుందని,ఉగాది పండుగ పరాభవ నామ సంవత్సర ప్రతి ఇంట సకల శుభాలు చేకూరాలని జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది మీ జీవితంలో
సరికొత్త ఆశలను చిగురింపజేయాలని,ఆనందమయంగా ఉండాలని,పరాభవ నామ సంవత్సరం మీ కుటుంబంలో సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు నింపాలని,ఉగాది పచ్చడిలో బాధలనే చేదు తగ్గి,సంతోషమనే తీపి పెరగాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ప్రతి కార్యకర్తకు నాయకులకు అభిమానులకు శ్రేయోభిలాషులకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
