కందనవోలు పులివెందుల

పులివెందుల నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి నాయకులు దివ్యాంగ శక్తి పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి,తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి మరియు వేంపల్లె టీడీపీ ఇంచార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మారెడ్డి లతా రెడ్డి మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు, దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.మారెడ్డి జోగిరెడ్డి మాట్లాడుతూ పులివెందుల గడ్డపై ప్రతి ఒక్క దివ్యాంగుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని,వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
అజ్జుగుట్టు రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, స్వయం ఉపాధి కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కూడా అందిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు అవసరమైన సహాయక ఉపకరణాలను పంపిణీ చేయడంతో పాటు,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్,ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కూటమి నాయకులు తూగుట్ల మధుసూదన్ రెడ్డి, నల్లాగారి భాస్కర్ రెడ్డి, పులివెందుల మండల వైస్ ఎంపీపీ విశ్వనాథ రెడ్డి,రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాష గారు,పుష్పగిరి స్కూల్ కరస్పాండెంట్,ఓబుల్ రెడ్డి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You missed