​కందనవోలు  పులివెందుల

పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ఇస్మాయిల్ చేసిన సేవలను గుర్తిస్తూ బుధవారం ఆయనకు ఘన సత్కారం జరిగింది. మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్,మాజీ వైస్ చైర్మన్ హఫీజ్ లు నేరుగా ఇస్మాయిల్ నివాసానికి వెళ్లి ఆయనను దుశ్శాలువాతో సత్కరించి, నూతన వస్త్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఇస్మాయిల్ అందించిన సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. కౌన్సిల్ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా,ప్రతి ఒక్కరి పట్ల మర్యాదపూర్వకంగా ఉంటూ తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించారని వారు తెలిపారు.నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులను గౌరవించుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని,ఇస్మాయిల్ సేవలు మరువలేనివని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్ రెడ్డి,ఖాదర్ బాషా మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.ఒక సాధారణ ఉద్యోగి చేసిన సేవలను గుర్తించి,ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు సత్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You missed