కందనవోలు తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారి మహా కుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం డాక్టర్ బ్రహ్మశ్రీ గురజాడ ఆనంద కుమార్ (జీకే) అధ్యక్షతన వారి స్వగృహంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ తొలి స్పీకర్, ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ బ్రహ్మశ్రీ సిరికొండ మధుసూదనాచారి, హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ బ్రహ్మశ్రీ కె. ఎం. కిరణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ పాల్గొన్నారు.
అతిథులు బలుసులమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు మోడేపల్లి నాగు, కర్రి అప్పలస్వామి, ఫణీంద్ర కుమార్, బ్రహ్మశ్రీ ధనాలకోట శోభన్ బాబు, ఫోరం ఫర్ డెమోక్రసీ ఏపీ కన్వీనర్ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ, ఎం.డి., సుతారు రాఘవేంద్ర తదితర విశ్వబ్రాహ్మణ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
