కందనవోలు ఆలూరు

ఆలూరు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యార్థిపై టీచర్ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థి ప్రవీణ్‌పై ఇంగ్లీష్ టీచర్ రజిని సిస్టర్ దారుణంగా కొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో బాలుడు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తల్లిదండ్రులు ఎల్లప్ప, ఈరమ్మ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదు. పిల్లలకు చదువు బోధించాల్సిన గురువులు హింసకు దిగడం బాధాకరం అని అన్నారు.ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారుల వెంటనే విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.పాఠశాలపై పూర్తి విచారణ చేపట్టాలి
విద్యాసంస్థలో పనిచేస్తున్న టీచర్ల అర్హతలు, సర్టిఫికెట్లు పూర్తిగా పరిశీలించాలని, విద్యార్థుల భద్రతపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..
