కందనవోలు కర్నూలు
కర్నూల్ లో చైన్ స్నాచింగ్కు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మూడో పట్టణ సీఐ శేషయ్య.. కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 10న బి. క్యాంపు హౌసింగ్ కాలనీలో ఇంటి ముందు చిన్నారితో కుర్చొని ఉన్న వృద్ధురాలు శ్యామలమ్మ మెడలోని బంగారు గొలుసును నిందితుడు ఎత్తుకెళ్లాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన ప్రవీణ్ గుర్తించినట్లు సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 3 తులాల బంగారు గొలుసు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్ను నిర్వహించిన నిందితుడు.. అందులో నష్టం రావడంతో ఇలా గొలుసు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
