కందనవోలు కర్నూలు
కురువ సమాజానికి చెందిన యువతీ యువకుల వివాహ సంబంధాల ఏర్పాటుకు “కురువ వివాహ పరిచయ వేదిక” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వరులు, వధువులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేదిక నిర్వాహకులు మాట్లాడుతూ, కర్నూలు జిల్లా కరువ సంఘం అధ్యక్షుడు పత్తికొండ కే శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి రంగస్వామి సమాజంలో ఉన్న యువతీ యువకులకు సరైన జీవిత భాగస్వామిని కనుగొనేందుకు ఇలాంటి పరిచయ వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పరస్పర పరిచయాల ద్వారా మంచి సంబంధాలు ఏర్పడి, కుటుంబ బంధాలు బలపడతాయని చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకుని, ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు కలుసుకునే అవకాశం పొందారు. ఈ విధంగా నిర్వహించిన పరిచయ వేదిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.
