కందనవోలు కల్లూరు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కల్లూరు మండలంలోని పలు వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మండలంలోని 32వ వార్డులో వార్డు ఇన్చార్జి నాగరాజు ఆధ్వర్యంలో, 34వ వార్డులో ఇన్చార్జి మాదన్న ఆధ్వర్యంలో, 35వ వార్డులో ఇన్చార్జి రవిప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీ స్థాపక ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.