కందనవోలు కల్లూరు

కల్లూరు అర్బన్ 33వ వార్డు పాత కల్లూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు పార్టీ అభివృద్ధి, ఎన్టీఆర్ ఆశయాల సాధనపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో 16 వార్డుల ఇంచార్జీలు, పార్టీ కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
