కందనవోలు కర్నూలు
నగరంలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఒక ప్రకటనలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో జాబ్‌మేళా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ జాబ్‌మేళాలో 16 కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 1110 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీ.టెక్ మరియు పీజీ వరకు చదువుకున్న వారందరూ ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు. కాబట్టి కర్నూలు నియోజకవర్గ నిరుద్యోగ యువతీ, యువకులు ఈజాబ్‌మేళాను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
