కందనవోలు కోడుమూరు

కోడుమూరు నియోజకవర్గంలోని పెంచికలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట రాముడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి ఆదేశాల మేరకు జరిగిన ఈ వేడుకల్లో ఎంపీటీసీ మద్దిలేటి, టిడిపి గ్రామ అధ్యక్షుడు తిప్పన్న, సీనియర్ నాయకులు కర్ణం చిన్న గిడ్డయ్య, గాదె నాగేష్, తలారి బ్రహ్మయ్య, సురేష్, తలారి గోపాల్, కె నాగ సుంకయ్య, కర్ణం యుగంధర్, మహేష్, కుమార్, రాముడు, శేఖర్, మధు, శివన్న, తిరుమలేష్, శీను తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత అని కొనియాడారు. “సమాజమే దేవాలయం –ప్రజలే దేవుళ్లు” అనే నినాదంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు.అప్పటి నుండి ఇప్పటివరకు వెనుకబడిన వర్గాల నాయకులు రాజకీయాల్లో ఎన్నో పదవులు చేపట్టి సమాజానికి సేవ చేసే అవకాశాన్ని పొందారని వారు పేర్కొన్నారు.
