కందనవోలు శ్రీశైలం

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ శ్రీ శ్రీ అఖిలభారత కురు వంశ నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు ఎం కే రంగస్వామి మాట్లాడుతూ సత్రంలో ఏలాంటి సభలు సమావేశాలు జరపరాదని ఆత్మకూరు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు మీటింగ్ జరపరాదని మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. టెంపుల్ యాక్ట్ అమలులో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా అక్కడ మీటింగ్ జరపరాదని కమిటీ సభ్యులు కోర్టుకు విన్నవించారు . వ్రాతపూర్వకంగా సమావేశం జరపడానికి ఏవ్వరు కమిటీ సభ్యులను కోరలేదు. ఇది సత్రంకు కమిటీ సభ్యులకు ఇబ్బంది కరంగా ఉందనే ఉద్దేశంతో కోర్టు ను ఆశ్రయించడం జరిగింది.ఈ సమావేశానికి కమిటీ సభ్యులు గుడిసె శివన్న,వేంకటేశ్వర్లు,కె.సి. నాగన్న, మహేష్, ప్రసాద్, తిరుపాలు,మద్దిలేటి పాల్గొన్నారు.