కందనవోలు కర్నూలు

అమ‌రావ‌తి ప్ర‌జా రాజ‌ధాని అని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. క‌ర్నూల్లోని ఆయ‌న నివాసంలో దీప‌కాంతుల న‌డుమ జై అమ‌రావ‌తి- మ‌న రాజ‌ధాని అని రాసి సంబ‌రాలు చేసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త ల‌భించ‌డం ప్ర‌జ‌లంద‌రూ సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల త‌రుపున కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎవ్వ‌రూ క‌దిలించ‌లేర‌న్నారు. సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోనే ఇది సాధ్య‌మైంద‌ని అన్నారు. అమ‌రావ‌తి ప్ర‌పంచంలోనే పేరుగాంచిన రాజ‌ధానిగా నిలిచిపోనుంద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీఐఐసీ డైరెక్ట‌ర్లు జ‌గ‌దీష్ గుప్తా, సంతోష్, ఏపీఐడీసీ డైరెక్ట‌ర్ సందీప్, తెలుగుయువ‌త రాష్ట్ర అధికార ప్ర‌తినిధి జూటూరు ర‌వి, లీగ‌ల్ సెల్ క‌ర్నూలు పార్లమెంట్ ఉపాధ్య‌క్షుడు గ‌ణేష్ సింగ్, టిడిపి నాయ‌కులు వినోద్ చౌద‌రి, శ్రీధ‌ర్, మ‌ల్లికార్జున గౌడ్, రాజేష్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.