కందనవోలు కర్నూలు

కర్నూలు నగరంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ రామాలయం 101 శతాధిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. పూజ చేసిన అనంతరం రథాన్ని ఆయన లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ప్రజలపై శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం పూర్తైన ఈ రోజుల్లో మనం జీవించి ఉండటం అదృష్టమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో అయోధ్య సమస్య ఎలాంటి వివాదం లేకుండా పరిష్కారం అయ్యిందన్నారు.
