కందనవోలు కర్నూలు

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన గొప్ప నాయకుడు డా.బాబు జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా కర్నూలు నగరంలోని ఆర్.ఎస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని మంత్రి టీజీ భరత్ గుప్తా కొనియాడారు. గొప్ప వ్యక్తుల చరిత్ర యువతరం తెలుసుకోవాలని సూచించారు.