కందనవోలు కర్నూలు

జాతీయ బీసీ సంఘం కార్యదర్శిగా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బత్తిని కుబేర్‌నాథ్‌ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన కుబేర్‌నాథ్ మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
రానున్న స్థానిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల కేటాయింపులో న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీసీలను చైతన్యపరుస్తూ సంఘటితంగా ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డా. అరుణ్ కుమార్‌లకు కుబేర్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా బలపడే దిశగా తన పూర్తి శక్తిని వినియోగిస్తానని హామీ ఇచ్చారు.

You missed