కందనవోలు లింగాల
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచి, బలోపేతం చేయడమే లక్ష్యంగా మంగళవారం పెద్దకూడాల గ్రామ పరిధిలో ‘బడి పండుగ’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి (MEO) రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడుల్లో లభించే నాణ్యమైన విద్య, వసతులను తల్లిదండ్రులకు వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, ప్రభుత్వ ఆశయ సాధనకు చేయూతను అందించాలని తల్లిదండ్రులను కోరారు.ఘనంగా పాల్గొన్న అధికారులు, ఈ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమంలో లింగాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO), ఐసీడీఎస్ (ICDS) సూపర్వైజర్లు, అంగన్‌వాడీ సిబ్బంది,పెద్దకూడాల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వాసుదేవ రెడ్డి, ఉపాధ్యాయులు అంకాల రెడ్డి, సెల్వ రాజు, యుగంధర్, పిడి షకీలా కీలక పాత్ర పోషించారు. అలాగే MPPS పెద్దకూడాల (రెగ్యులర్), MPPS పెద్దకూడాల స్పెషల్ పాఠశాలల ఉపాధ్యాయులు నారాయణరెడ్డి, విశాల, చలమారెడ్డి మరియు నాయక్ సార్‌లు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
