కందనవోలు ఆస్పరి

 

 

సొసైటీ బ్యాంక్ ఫోర్జరీ కేసు విచారణ పేరుతో వేధించారని ఆరోపిస్తూ హనుమంతరెడ్డి అనే వ్యక్తి మంగళవారం ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంటనే ఆయనను ఆస్పరి ఆసుపత్రికి, అక్కడి నుంచి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఐ మహిళలతో అనుచితంగా మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి. పోలీసుల తీరుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

You missed