కందనవోలు నంద్యాల
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదిన వేడుకలను జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్పీ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సమరంలో, అలాగే భారతదేశ విద్యా అభివృద్ధిలో అపూర్వ సేవలు చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారని కొనియాడారు.మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారు 1888 నవంబర్ 11న మక్కా నగరంలో జన్మించారు. చిన్నప్పటినుండే ఆయనకు చదువుపై గొప్ప ఆసక్తి, అరబీ, ఫార్సీ, ఉర్దూ, ఇంగ్లీషు వంటి ఎన్నో భాషల్లో పాండిత్యం పొందారు. ఆయన గొప్ప రచయిత, జర్నలిస్ట్, వక్త, మరియు స్వాతంత్ర్య సమరయోధుడు.స్వాతంత్ర్య పోరాటంలో ఆయన మహాత్మా గాంధీ అనుచరుడిగా పనిచేశారు. సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో ముఖ్య పాత్ర వహించారు. దేశం విభజించబడకుండా ఐక్యతగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రయత్నించారు.భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఆయన మన దేశానికి మొదటి విద్యామంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. ఐఐటీ లు, యూజీసీ, జాతీయ విద్యా మండలి వంటి ఎన్నో విద్యా సంస్థల స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. మన విద్యావ్యవస్థలో శాస్త్రీయ దృష్టి, అభ్యాసంలో స్వేచ్ఛ, ప్రతి ఒక్కరికీ విద్య హక్కు అనే భావనలను ఆయన బలంగా ముందుకు తెచ్చారు. ఆయన జన్మదినమైన నవంబర్ 11ను మనం ప్రతి సంవత్సరం ‘జాతీయ విద్యాదినోత్సవం’గా జరుపుకుంటాము, విద్యార్ధులకి విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసే రోజు అది.మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 22 ఫిబ్రవరి 1958 లో ఈ లోకాన్ని విడిచి వెళ్లినా, ఆయన ఆలోచనలు, ఆయన చూపిన మార్గం ఇప్పటికీ మనకు మార్గదర్శకంగా ఉన్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యన్. యుగంధర్ బాబు స్పెషల్ బ్రాంచ్ డీస్పీ శ్రీనివాసరెడ్డి , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ,జిల్లా పరిపాలన అదికారులు కార్యాలయ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం నంద్యాల
