కందనవోలు కర్నూలు

ఆంధ్రప్రదేశ్ ఫార్మా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ (యాప్సీ) ఆధ్వర్యంలో రూపొందించిన తొలి రాష్ట్ర స్థాయి అధికారిక న్యూస్ బులెటిన్‌ను కర్నూలు నగరంలోని యాప్సీ భవన్‌లో సంఘం నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఫార్మా సేల్స్ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ బులెటిన్‌ను రూపొందించినట్లు నాయకులు తెలిపారు. ఫార్మా రంగంలో చోటుచేసుకుంటున్న తాజా మార్కెట్ పరిణామాలు, పరిశోధనలు, ప్రభుత్వ విధానాలు, సాంకేతిక మార్పులు, ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని బులెటిన్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఫార్మా ఉద్యోగులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు అంతర్గత సమాచార మార్పిడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.నాలుగు నగరాల్లో ఏకకాలంలో విడుదల రాష్ట్రవ్యాప్తంగా సభ్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో న్యూస్ బులెటిన్‌ను కర్నూలుతో పాటు తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో ఏకకాలంలో విడుదల చేశారు. బులెటిన్‌ ఎడిటర్‌గా సంఘం ఉపాధ్యక్షులు సంజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.నాయకుల సమక్షంలో ఆవిష్కరణ కర్నూలు యాప్సీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు, బులెటిన్ ఎడిటర్ సంజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సహకార్యదర్శి రామలింగేశ్వరుడు, కోశాధికారి లక్ష్మీ నారాయణతో పాటు కార్యవర్గ సభ్యులు, వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఫార్మా సేల్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఐక్యత బలోపేతం, సమాచార మార్పిడికి బులెటిన్ దోహదపడుతుందని నాయకులు తెలిపారు.

You missed