కందనవోలు కర్నూలు,
ఏపీ గవర్నర్ ఏస్. అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేశారు. గవర్నర్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు గవర్నర్ పలకరించారు. అనంతరం గవర్నర్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా మరియు వైద్య సంస్థలను సందర్శించనున్నారు. స్థానిక ప్రజలు కూడా గవర్నర్ పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది.
