కందనవోలు కర్నూలు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు..ఎంపీ తన సొంత గ్రామమైన కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎన్.ఆర్.ఈ.జీ.ఏ నిధులు రూ.47 లక్షలతో రామాలయం నుంచి జెమ్మిచెట్టు వరకు నూతనంగా నిర్మిస్తున్న సీ.సీ రోడ్డు తో పాటు, ఎంపీ నిధులు రూ.15 లక్షలతో ఎస్సీ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేశారు…ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పంచాయతి నిధులను పక్క దారికి మళ్ళించడంతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు…కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తుందని ఆయన తెలిపారు…ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్, మొహమ్మద్ రఫీ, సచివాలయం ఉద్యోగులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు..
