కందనవోలు నంద్యాల

నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి,నంద్యాల డిసిసి అధ్యక్ష బాధ్యతలనుంచి స్వచ్చందంగా తప్పుకుంటూ, ఏఐసీసీ సభ్యులుగా,కర్నూల్ జిల్లా ఇంచార్జి గా,పాణ్యం నియోజకవర్గం సమన్వయ కర్త గ కొనసాగుతానుకాంగ్రెస్ పార్టీ లో పని చేసే నీతి,నిబద్దత కలిగిన నాయకులు, కార్యకర్తలైన ఆశావాహుల నుంచి నంద్యాల డిసిసి అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానంజంగిటి లక్ష్మి నరసింహ యాదవ్,కర్నూల్ జిల్లా ఇంచార్జి, & ఏఐసీసీ మెంబర్, నంద్యాల జిల్లా అధ్యక్షులు జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు  రాహుల్ గాంధీ  మరియు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  మల్లికార్జున ఖర్గే  ఆదేశాల మేరకు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి  ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జిల్లా మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా మన నంద్యాల జిల్లాకు నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, ఏఐసీసీ పరిశీలకులు, బెంగుళూరు లోని శాంతి నగరం శాసనసభ్యులు  ఎన్. ఏ. హారీస్,  ఏపీసీసీ ప్రదానకార్యదర్శి సుధాకర్ రెడ్డి  కె కె సి రాష్ట్ర చైర్మన్ కృష్ణా రెడ్డి, బి. రవిచంద్ర గారు నంద్యాల జిల్లాలో ని అన్ని నియోజకవర్గాలలో 30.11.2025 నుంచి జిల్లాలో ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గా లలో పర్యటన చేస్తారని,జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్,

ఏఐసీసీ సభ్యులు&,కర్నూల్ జిల్లా ఇంచార్జి
ఈ రోజు పత్రిక సమావేశములో తెలియ చేయడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేను గత 7 సంవత్సరాలనుండి నుండి నంద్యాల డిసిసి గా  రఘు వీరారెడ్డి  శైలజ నాథ్  గిడుగు రుద్రరాజు  వై ఎస్ షర్మిల రెడ్డి,  సహకారముతో విజయవంతం చేయడం జరిగింది.ప్రస్తుతం
నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి,
నంద్యాల డిసిసి అధ్యక్ష బాధ్యతల నుంచి స్వచ్చందంగా తప్పుకుంటూ, ఏఐసీసీ సభ్యులుగా,కర్నూల్ జిల్లా ఇంచార్జి గా,పాణ్యం నియోజకవర్గం సమన్వయ కర్త గ కొనసాగుతాను. కావున కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తున్న ఆశావాహులు ప్రతి కార్యకర్త నంద్యాల డిసిసి అధ్యక్షుల పదవికి దరఖాస్తు చేసుకోవాలని మనవి. నంద్యాల జిల్లా కేంద్రంలో మరియు నియోజకవర్గాల కేంద్రాలలో కాంగ్రెస్ నాయకులు మరియు సీనియర్ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి ఆ నివేదికను అధిష్టానానికి సమర్పిస్తారు. వారి సర్వే ద్వారా అర్హులైన వారిని అధిష్టానం ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగి, నీతి, నిబద్దత,నిజాయితీ గా పార్టీ పటిష్టత కోసం పని చేయాలనుకున్న వారు దరఖాస్తులను కేంద్ర కమిటీకి అందచేసుకోవాలని కోరారు.ఈ సమావేశమునకు నంద్యాల జిల్లా నందలి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఏఐసీసీ, పీసీసీ సభ్యులు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, గత డిసిసి కమిటీ నందలి సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తప్పక హాజరు కావలసిందిగా కోరుచున్నాము.ఈ కార్యక్రమములో డోన్ నియోజకవర్గం సమన్వయ కర్త (ఇంచార్జి )డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి, నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, హెచ్. బాలస్వామి,అసంగటిత కార్మిక సంఘం కర్నూల్, అనంతపురం ఇంచార్జి పఠాన్ హబీబ్ ఖాన్, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి రజాక్ వలి,జిల్లా కార్యదర్శి హుస్సేన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

You missed