కందనవోలు కర్నూలు

41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో 37వ వార్డు ఇన్‌చార్జ్ సుతారు రాఘవేంద్ర (కత్తి స్వామి) – లిఖిత్  నివాసంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజను శోభాయమానంగా, శుభపర్వదినంలా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ పూజను శ్రీ హరి నారాయణ గురు స్వామి (39వ పడి)  చేతుల మీదుగా సంప్రదాయబద్ధంగా కొనసాగించారు.ఈ శుభకార్యానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే, మహిళ–శిశు–వికలాంగుల–వయోవృద్ధుల సంక్షేమ చైర్‌పర్సన్  గౌరు చరిత రెడ్డి  హాజరై కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు అందించారు. యువ నాయకులు గౌరు జనార్ధన్ రెడ్డి  మాజీ ఎమ్మెల్సీ కె.ఈ. ప్రభాకర్ మాజీ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జున రెడ్డి  ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్  కమ్మరి పార్వతమ్మ  పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.అయ్యప్ప స్వాములు, భక్తులు, కుటుంబ సభ్యులు అందరూ కలసి పెళ్లి శుభకార్యంలా ఈ పర్వాన్ని ఘనంగా పూర్తిచేశారు.

You missed