కందనవోలు గూడూరు

పెంచికలపాడు గ్రామంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మార్గదర్శకత్వంలో, కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కే. వెంకటరాముడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలను ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ మద్దిలేటి, కర్ణం కురువ చిన్న గిడ్డయ్య, సీనియర్ నాయకులు నగేష్, చంద్రశేఖర్, తిప్పన్న, సిలేర్ జనసేన ఓబులేసు తదితరులు పాల్గొన్నారు

You missed