కందనవోలు కర్నూలు,
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నందు జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర నాయకులు వెళ్లడం జరిగింది. అలాగే నర్సీపట్నం అసోసియేషన్ వాళ్ళతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు నుమ ర్యాదపూర్వకంగా కలిసి భవననిర్మాణ కార్మికుల బోర్డు పునర్ నిర్మించాలని, కార్మిక సోదరులు చేసిన క్లెయిమ్ చేసిన సంక్షేమ పథకాలన్నీ ఇవ్వాలని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే ఎలక్ట్రిషన్ సోదరుల సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది. స్పీకర్ ను కలిసిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు డివి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ పాల్ రాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీ హరిరావు. నర్సీపట్నం అధ్యక్షులు లంక వీర పాత్రుడు, మరియు ఎలక్ట్రిషన్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
