కందనవోలు న్యూస్ కర్నూలు

 

 

కర్నూలు జిల్లా కర్నూలు మండలం దిన్నదేవరపాడు గ్రామం ఉపరవాన శాఖ కార్యాలయంలో కందనవోలు న్యూస్, సంక్షేమ సాక్షి పత్రిక మరియు రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్లను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప రవాణా శాఖ కమిషనర్ మాట్లాడుతూ జర్నలిస్టు లు సమాజంలో చెడును పార దోయాలని, అవినీతి లేని సమాజ స్థాపనకు పాటుపడాలని, ఉన్నది ఉన్నట్టుగా వార్తలు రాయాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రిక విలేకరులు ఉంటున్నారన్నారు. ఏమైనా సమాచారం రావాలన్నా ప్రజలకు పత్రికల ద్వారానే తెలియజేస్తుందని ఆమె అన్నారు. జాతీయ రోడ్డు భద్రత 37వ మాసోత్సవాలు 2026 జనవరి 1 నుండి 31 వరకు 37వ మాసోత్సవాలో భాగంగా శనివారం 17 రోజు కొనసాగుతుందని ఆమె తెలిపారు. వాహనాదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. నాలుగు చక్రాల వాహనాదారులు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించి వాహనాలను నడపాలని తెలియజేశారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించరాదన్నారు. వాహనాదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ఎంతో ప్రమాదకరమని ఆమె తెలియజేశారు. ఏఐటివిపి కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను తనిఖీలు కొనసాగిస్తున్నామన్నారు. బస్సులకు సంబంధించి అన్ని వ్యాలీడ్ పత్రాలు ఫిట్నెస్ సర్టిఫికెట్, టాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్స్, మరియు భద్రత ప్రమాణాలు అనగా ఎమర్జెన్సీ ఎక్స్ఇటూ, ఫైర్ ఎక్స్టింగుషర్స్, సేఫ్టీ హ్యామర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ను పరిశీలించారు. బస్సులో పేలుడు పదార్థాలు మరియు కమర్షియల్ సామాన్లు తీసుకొని వెళుతున్నారా అని తనకిలు జరపాలన్నారు. మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక రద్ది కారణంగా, అధిక టికెట్ ధరలు ప్యాసింజర్ల పై వసూలు చేస్తున్నారా అని తనికి చేశారు. ఈ నిబంధనలు అతిక్రమించిన బస్సు ల పై కేసు లు రాసి జరిమానా విధిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె మల్లికార్జున, కె రవీంద్ర కుమార్, నాగరాజా నాయక్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బాబు కిషోర్, గణేష్ బాబు, పాల్గొని నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె శ్రీనివాసులు, కందనవోలు దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ సంధ్య ప్రసాద్, సంక్షేమ సాక్షి తెలుగు దినపత్రిక సంపాదకులు కె రాజశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ఇలాంటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, రాబోయే రోజుల్లో అసోసియేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

You missed