కందనవోలు కర్నూలు

కర్నూల్ నగరంలోని కల్లూరు తాసిల్దార్ కే. ఆంజనేయులు గారి తో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, సంక్షేమ సాక్షి నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధులు, మీడియా సిబ్బందికి ఇది దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ ఇటువంటి క్యాలెండర్లు పత్రికలతో ప్రజలకు అవసరమైన సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే మీడియా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. సంక్షేమ సాక్షి సంపాదకులు కె రాజశేఖర్ మాట్లాడుతూ, నూతన క్యాలెండర్ రూపకల్పన అభినందనీయమని తెలిపారు. కందనవోలు దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ సంధ్య ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కె ఆంజనేయులు విఆర్వోలు మరియు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
