కందనవోలు కర్నూలు

 


స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ, 37వ వార్డు ఇన్‌చార్జి సుతారు రాఘవేంద్ర కలిసి మహానుభావుడు ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో వారు ఎన్‌టీఆర్ రాజకీయ, సామాజిక సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆదర్శాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొని ఎన్‌టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు.

You missed