కందనవోలు కర్నూలు

కల్లూరు మండలం 33వ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కట్ట వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, గౌరు దంపతుల తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలు, ప్రజాహిత పాలనను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 37 మరియు 41వ వార్డుల క్లస్టర్ ఇన్‌చార్జి జనార్ధన్ ఆచారి యూనిట్ ఇన్‌చార్జీలు, బూత్ ఇన్‌చార్జీలు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తదుపరి భాగంగా ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ బ్యాంక్ (రక్తదాన) కార్యక్రమంలో గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొని, రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవ చేయడమే ఎన్టీఆర్ నిజమైన నివాళి అని ఆయన తెలిపారు.
