కందనవోలు కర్నూలు
ఈ నెల 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సంధర్బంగా 18వ తేదీ తెల్లవారు జామున ఎస్. శాంత కుమారి, ఉప రవాణా కమిషనర్, కర్నూలు వారి ఆదేశాలతో అధిక వేగముతో వెళ్ళు వాహనముల మీద స్పీడ్ లేజర్ గన్ తో తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భముగా అధిక వేగముతో వెళ్ళు వాహనదారులకు రోడ్డు భద్రత గురించి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పాటించవలసిన లెన్ నియమాలగురించి అవగాహన కల్పించారు మరియు జాతీయ రహదారులపైన గల తెలుపు లైన్ ల గురించి వివరించారు మరియు సీట్ బెల్ట్ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియచేసారు. ఈ నిబంధనలు అతిక్రమించిన వాహనముల పై 15 కేసు లు రాసిజరిమానా విధించారు.ఈ తనకి లో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కే. రవీంద్ర కుమార్ మరియు సిబంది పాల్గొన్నరు.
