కందనవోలు కర్నూలు

గుంటూరు నగరంలో ఆదివారం నిర్వహించిన ఫస్ట్ షార్ట్ కోర్స్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్- 2026 పోటీల్లో కర్నూలు జిల్లా ఈత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కర్నూల్ నుంచి పాల్గొన్న నలుగురు బాలికలు మొత్తం 18 మెడల్స్ సాధించారు. సిరి చేతన రాజ్ 1500,400 మీటర్స్ ఫ్రీ స్టైల్, 100, 200 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్, 400 మీటర్స్ లో ఇండిజువల్ మిడ్లే ఈవెంట్లలో మొదటి స్థానంలో నిలిచి ఐదు గోల్డ్ మెడల్స్, కె. శృతి 800, 200 మీటర్స్ ఫ్రీ స్టైల్ లో రెండు గోల్డ్, 200 మీటర్స్ బటర్ఫ్లై లో గోల్డ్, 100 మీటర్స్ బటర్ఫ్లై, 200 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ లో సిల్వర్ మెడల్స్, 200 సామియా తంజూమ్ 50 మీటర్స్ ఫ్రీ స్టైల్ లో గోల్డ్, 50, 100 మీటర్స్ బటర్ఫ్లై లో గోల్డ్ మెడల్స్, పి. లహరి 50, 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ లో గోల్డ్, 400,800 మీటర్స్ ఫ్రీ స్టైల్ లో సిల్వర్ మెడల్స్, 200 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్ లో బ్రాంచ్ మెడల్స్ సాధించారు. పథకాలు సాధించిన క్రీడాకారులను డీ ఎస్ డీ ఓ భూపతిరావు, స్విమ్మింగ్ కోచ్ నటరాజ్, కర్నూలు డిస్టిక్ ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహచారి, కార్యదర్శి రామకృష్ణ యాదవ్, కోశాధికారి దస్తగిరి, ఉపాధ్యక్షులు సర్వేష్ గౌడ్, రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు అజయ్, శివ, జాయింట్ సెక్రెటరీ శివరాజ్ అభినందించారు.

You missed