వి.కోటలో విలేకర

కందనవోలు కర్నూలు

చిత్తూరు జిల్లా వికోటలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనను ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె హరినాథ్ రెడ్డి. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి రామకృష్ణ. కే మధు సుధాకర్. ఉపాధ్యక్షులు ఎస్ ఎన్ ప్రసాద్ యాదవ్. కోశాధికారి. సామెల్. టీ వి మనోహర్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి. సి సుదర్శన్. వి జెవి శ్రీనివాసులు కందనోలు శ్రీనివాసులు. జిల్లా నాయకులు తదితరులు తీవ్రంగా ఖండిచారు.

పట్టపగలే వి.కోటలో విలేకరి హత్య దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం కఠిన చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీజేఎఫ్ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా నిలిచే పాత్రికేయులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ హత్య మీడియాపై జరిగిన దాడిగా పరిగణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.పాత్రికేయ వృత్తి నిర్వహణలో ఉన్న వారిపై ఇలాంటి దాడులు పెరుగుతుండటం తీవ్రమైన పరిణామమని ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జర్నలిస్టు వ్యవస్థను బెదిరించలేవని, నిజం వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయులు వెనుకడుగు వేయరని వారు స్పష్టం చేశారు. అయితే, జర్నలిస్టుల భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఫీల్డ్‌లో పని చేసే విలేకరులకు భద్రతా చర్యలు కల్పించాలని కోరారు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి హత్యకు గల అసలు కారణాలను వెలికితీయాలని, కుట్ర కోణం సహా అన్ని దిశల్లో విచారణ చేపట్టాలని ఫెడరేషన్ సూచించింది. దోషులు ఎవరికైనా సంబంధం ఉన్నా కఠినంగా శిక్షించాలనే స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని అభిప్రాయపడింది. మృతుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

You missed