కందనవోలు కర్నూలు
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు దివ్య సమాఖ్య వినతిపత్రం సమర్పించింది. 1950 ప్రెసిడెంట్ ఆర్డర్‌ను రద్దు చేయాలని, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లకు విరుద్ధంగా ఉన్న వివక్షాత్మక నిర్ణయమని నాయకులు పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దళితులపై హత్యలు, దళిత మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అరికట్టాలని కోరారు. అలాగే రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణ రాజు మత కలహాలను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. రామాంజనేయులు మాట్లాడుతూ, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. కర్నూలులో ఈ ప్రకటన విడుదల చేశారు.
