కందనవోలు కర్నూలు

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను సవరణ చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజం మరియు ఇండియన్ క్రిస్టియన్ మైనారిటీ రైట్స్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్. జయ కాంత్ క్రిస్టియన్ నాయకత్వంలో ఈ వినతి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమానత్వ హక్కు, వివక్షకు వ్యతిరేక రక్షణ, మత స్వేచ్ఛను కల్పించినప్పటికీ, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కారణంగా క్రైస్తవ మతంలోకి మారిన దళితులు ఎస్సీ హోదా కోల్పోతున్నారని తెలిపారు.
మత మార్పిడి జరిగినప్పటికీ వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు లేకపోయినా, రిజర్వేషన్లు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కులకు భంగం కలిగించడమే కాకుండా మత స్వేచ్ఛను కూడా పరిమితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని, అలాగే ఈ అంశంపై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు నివేదిక పంపించాలని వారు కలెక్టర్‌ను కోరారు

You missed