కందనవోలు కర్నూలు

వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మా పాఠశాల విద్యార్థులు విజయ కేతనము ఎగుర వేశారని పాఠశాల చైర్మన్ మరియు డైరెక్టర్లు టీ దీక్షిత్, కరస్పాండెంట్ పి శేషన్న, కార్యదర్శి కె.పి అరుణశ్రీ విద్యార్థులకు అభినందన సభలో సగర్వంగా తెలియజేశారు. ఈ సందర్భముగా టీ దీక్షిత్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు పైగా నిలకడగా 590 మార్కులు సాధిస్తున్న. విద్యాసంస్థ మా దేనని ఇంకా ప్రస్తుత విద్యా సంవత్సరము 2025- 26 కు గాను 590, 586, 586, 584, 583, 582 ,582, 580 ఇలా అత్యధిక అత్యధిక మార్కులు సాధించి మా పాఠశాల విద్యార్థులు ఆణి ముత్యాలుగా నిలిచారన్నారు. ఇంకా 540 మార్కులకు పైగా 60 మంది విద్యార్థులు 500 పైగా 100 మంది విద్యార్థులు సాధించారని సభలో వెల్లడించారు. మా విద్యార్థుల కటోర శ్రమ, క్రమశిక్షణ ,ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి ఏటా మా పాఠశాల ఉత్తమ ఫలితాలను సాధిస్తూ అద్భుతాలను సృష్టిస్తుందని తెలియజేశారు. పాఠశాల కరస్పాండెంట్ పి శేషన్న మాట్లాడుతూ కేవలం జ్ఞానాన్ని పంచడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును బంగారు మయం చేయడమే లక్ష్యంగా సాగుతున్న మా శ్రీ లక్ష్మీ పాఠశాల ప్రయాణంలో ఇదొక మరుపురాని మైలురాయి అని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ,ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల కార్యదర్శి కె.వి అరుణశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక నాంది అని ఈ ప్రయాణము ఇలాగే దిగ్విజయంగా సాగాలని విద్యార్థులను అభినందించారు చివరగా ప్రతిభను చాటిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం సత్కరించారు ఈ అభినందన సభలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
