కందనవోలు కర్నూలు
మేయర్ అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మేయర్ అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల వ్యవహారాలను ఈ కార్యాలయం ద్వారా నిర్వహించనున్నారు.
ఈ ఎన్నికల ప్రక్రియకు సెట్కూరు సీఈఓ డా. కే. వేణుగోపాల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఎన్నికలకు సంబంధించిన విధివిధానాలు, నిబంధనల ప్రకారం సంబంధిత ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
