కందనవోలు ఆలూరు

 

ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హొలగుంద పట్టణంలో ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా, సౌహార్ద వాతావరణంలో నిర్వహించేందుకు హోలగుంద పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం నిర్వహించారు. పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హిందూ, ముస్లిం సహా వివిధ మతాల పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ, శోభాయాత్ర సమయంలో ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవాన్ని పాటిస్తూ మత సమరస్యాన్ని కాపాడాలని సూచించారు. పండుగలు అన్నవి ఆనందానికి, ఐక్యతకు ప్రతీకలని, వాటిని వివాదాలకు వేదికగా మార్చకుండా అందరూ సహకరించాలని కోరారు. ఎటువంటి అపోహలు, వదంతులను నమ్మకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
అలాగే, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.
ఈ సమావేశంలో ఆలూరు సిఐ రవి శంకర్ రెడ్డి, హొలగుంద ఎస్సై దిలీప్ కుమార్, ఇన్‌చార్జి ఎమ్మార్వో నిజాముద్దీన్‌తో పాటు మత పెద్దలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

You missed