కందనవోలు కర్నూలు

 

కర్నూలు ఉద్యోగ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని శ్రీశ్రీశ్రీ విశ్వేశ్వర సహిత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం పుణ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ మధ్విరాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా, వేడుకల సందడి మధ్య నిర్వహించబడింది.
ఈ మహోత్సవాన్ని దేవాలయ కమిటీ సభ్యులు లక్ష్మణాచారి, వెంకటరమణాచారి ఆధ్వర్యంలో శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ ఆశీస్సులు పొందారు.
అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించేలా జరిగింది. భక్తులతో కిటకిటలాడిన ఈ కార్యక్రమంలో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ దేవపూజ ధనుంజయ ఆచారి , దేవాలయ కమిటీ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘీయులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

You missed