కందనవోలు కర్నూలు

 

లక్ష్మీదేవమ్మ ట్రేడర్స్‌ యజమాని వై. మురళీధర్‌రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వ్యాపారులు, శ్రేయోభిలాషులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి మురళీధర్‌రెడ్డికి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
గత 40 సంవత్సరాలుగా లక్ష్మీదేవమ్మ ట్రేడర్స్‌ను నిర్వహిస్తూ వ్యాపార రంగంలో మురళీధర్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. నాలుగు దశాబ్దాలుగా వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వ్యాపారాన్ని కొనసాగించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. నాణ్యమైన వస్తువులను అందిస్తూ వినియోగదారులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.
జన్మదిన వేడుకల సందర్భంగా బంధుమిత్రులు, వ్యాపార భాగస్వాములు, శ్రేయోభిలాషులు మురళీధర్‌రెడ్డిని శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ లక్ష్మీదేవమ్మ ట్రేడర్స్‌ మరింత అభివృద్ధి సాధించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
సివిల్ ఇంజనీర్ అకిల్ రెడ్డి, జీవన్ హాస్పిటల్ నిర్వాహకులు అనీఫ్, కాంట్రాక్టర్ ఇమ్రాన్, యూకన్ ప్లాజా యజమాని అమన్ ఖాన్ , ఇంజనీర్ రిజ్వాన్ శ్రీచక్రా మీడియా గ్రూప్ ఎండీ డాక్టర్ కే. హరినాథరెడ్డి, కందనవోలు దినపత్రిక ఎడిటర్ శ్రీనివాసులు , విజ్ఞాన వాణి పత్రిక ఎడిటర్ రామకృష్ణ, ఎంఎస్ లైఫ్ సీనియర్ బిజినెస్ మేనేజర్ మణికుమార్, టెక్నికల్ మేనేజర్ లక్ష్మి గణేష్ తదితరులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. , స్నేహితులు, వ్యాపార ప్రముఖులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

You missed